టాలీవుడ్: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా సూపర్ హిట్ సాధించిన నటుడు ‘నవీన్ పోలిశెట్టి’ ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘జాతి రత్నాలు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఈరోజు విడుదల చేసారు. ఈ సినిమా మార్చ్ 11 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో నవీన్ తో పాటు, టాప్ కమెడియన్స్ ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ‘జోగిపేట శ్రీకాంత్’ గా నటించనున్న నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ కి సంబందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా నుండి విడుదలైన ‘చిట్టి చిట్టి’ పాట కూడా సూపర్ హిట్ అయింది.
కే.వీ. అనుదీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని స్వప్న సినిమాస్ బ్యానర్ పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల అవబోతున్నట్టు ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేసారు. అది కూడా ఫుల్ కామెడీ తో ఆకట్టుకుంది. ‘ఇంట్లో కాదు థియేటర్లలో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం.. చాలా రోజులు సినిమాలు షూటింగ్ చేసి విడుదల చేయరు లాంటి మాటలకి ఫుల్ స్టాప్ పెట్టి మేము ఇక విడుదల చేస్తున్నాం’ అని సెట్టైరికల్ గా ఒక వీడియో షేర్ చేసారు. ఈ సినిమాతో పాటు మహా శివరాత్రి సందర్భంగా మార్చ్ 11 న శ్రీ విష్ణు ‘గాలి సంపత్‘ మరియు శర్వానంద్ ‘శ్రీకారం‘ విడుదల అవుతున్నాయి.