fbpx
HomeMovie Newsఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం నాని స్పెషల్ వీడియో

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం నాని స్పెషల్ వీడియో

NaniSpecialVideo For FrontloneWarrirors

టాలీవుడ్: కరోనా సమయం లో డాక్టర్స్ ముందుండి తాము వైరస్ కి ఎక్స్పోజ్ అయినా కూడా వెనుకాడకుండా ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి కృషి చేసారు. అలాంటి డాక్టర్స్ పైన ఎన్నో ప్రాంతాల్లో దాడులు కూడా జరిగాయి. కానీ కొంత మంది తమ ప్రాణాలని కాపాడిన డాక్టర్లని దేవుళ్లుగా భావించి వాళ్ళకి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో మంది డాక్టర్స్ కరోనా ట్రీట్మెంట్ చేస్తూ కరోనా సోకి చనిపోయారు కూడా. కరోనా కి ట్రీట్మెంట్ చేయడమే ఒక రిస్క్ ఫాక్టర్ అనుకుంటే ఆ ట్రీట్మెంట్ కోసం వీళ్ళు కొన్ని గంటలు పి.పి.ఈ కిట్స్ ధరించి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటది. అది ఎంత ఘోరంగా ఉంటుందో చాలా వీడియోస్ లో మనం చూసే ఉంటాం.

ఇపుడు టాలీవుడ్ నుండి నాచురల్ స్టార్ నాని డాక్టర్స్ కోసం ఒక స్పెషల్ వీడియో రూపొందిస్తున్నాడు. ఈ వీడియో ని డాక్టర్స్ కి అంకితం చేయనున్నట్టు హింట్ ఇచ్చాడు. ఈ రోజు ట్విట్టర్ లో నాని ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం అని ఒక వర్కింగ్ స్టిల్ పెట్టాడు. దానితో పాటు స్టెతస్కోప్ సింబల్ జోడించి మ్యూజిక్ మరియు హార్ట్ ఎమోజిస్ పెట్టాడు. డాక్టర్స్ చేస్తున్న సేవలకు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళకి కూడా కొంచెం ఊరట ఉంటుందనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular