fbpx
HomeMovie Newsఫామిలీ కోసం ఏదైనా చేసే 'టక్ జగదీశ్'

ఫామిలీ కోసం ఏదైనా చేసే ‘టక్ జగదీశ్’

Nani TakJagadeesh TeaserReleased

టాలీవుడ్: నాని హీరోగా రూపొంది ఏప్రిల్ నెలలో విడుదలకి సిద్ధం అవుతున్న సినిమా ‘టక్ జగదీశ్’. నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని విడుదల చేసారు. ‘నిన్ను కోరి’ , ‘మజిలీ’ లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీస్ రూపొందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమా రూపొందించాడు. ఈ సినిమాకి ఫామిలీ మరియు యాక్షన్ జానర్ ని ఎంచుకున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో నాని కి జోడీ గా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. నాని కి అన్న పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు.

ఈ సినిమాలో నాని కి మరియు అన్న పాత్ర పోషించిన జగపతి బాబు మధ్య అనుభందం చుట్టూ సినిమా తిరుగుతుంది అని టీజర్ చూస్తే తెలుస్తుంది. తన కుటుంబానికి వచ్చిన ఆపద ఏంటి ఆ ఆపద నుండి హీరో ఎలా బయటపడగలిగాడు అనేది ‘టక్ జగదీశ్’ సినిమా థీమ్ అన్నట్టు టీజర్ చూస్తే అనిపిస్తుంది. మజిలీ సినిమాని నిర్మించిన ‘షైన్ స్క్రీన్స్ ‘ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా బ్యాక్ డ్రాప్ లో ఒక పాటతో టీజర్ మొత్తం ఆకట్టుకున్నాడు. ఆ పాట లిరిక్స్ జనాలని ఆకర్షించాయి. ఏప్రిల్ 23 న థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular