టాలీవుడ్: రీ-ఇన్వెంటింగ్ నందు అంటూ ‘నందు విజయ కృష్ణ’ ప్రస్తుతం నటిస్తున్న సినీమా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ టీజర్ ఈరోజు విడుడలైంది. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించిన నందు అడపా దడపా హీరో లాంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. అతను హీరో గా నటించిన చివరి సినిమా ‘సవారి’. ప్రస్తుతం ఈ హీరో ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే మరొక సినిమాతో మన ముందుకస్తున్నాడు. ఈ సినిమాలో యాంకర్ గా సత్తా చాటుతున్న రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది. విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై ఆనంద్ రెడ్డి, ప్రవీణ్ పగడాల,మనోహర్ రెడ్డి , బోసుబాబు నిడుమోలు కలిసి ఈ సినిమాని నిర్మించారు. రాజ్ విరాట్ అనే కొత్త దర్శకుడు ఈ సినీమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. ప్రశాంత్ ఆర్.విహారి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలు నందు ‘పోతురాజు’ అనే క్యారెక్టర్ లో డైరెక్టర్ ‘పూరి జగన్నాథ్’ కి డై హార్డ్ ఫ్యాన్ గా నటిస్తున్నాడు. సినిమాల్లో రియల్ హీరో ల ఫ్యాన్ గా చాలా మంది హీరోలు చేసారు. కానీ ఒక డైరెక్టర్ గా ఫ్యాన్ గా చేయడం చాలా అరుదు. సినీమా టీజర్ ని ఒక స్టేజి నాటకం ఏర్పాట్లతో మొదలు పెట్టారు. ఈ సినిమాలో నందు ఒక స్టేజి ఆర్టిస్ట్ అని అర్ధం అవుతుంది. ఇక హీరోయిన్ రష్మీ గొడవలు అంటే చాలా ఇష్టపడే పోతురాజు లవర్ వాణిగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే నటన పరంగా నందు ఒక మెట్టు ఎదిగాడని అర్థం అవుతోంది. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఇప్పటికే షూటింగ్ తోపాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.