fbpx
HomeMovie Newsదేవి, సిద్ ల 'రంగ్ దే' మ్యూజికల్ మ్యాజిక్

దేవి, సిద్ ల ‘రంగ్ దే’ మ్యూజికల్ మ్యాజిక్

NaaKanuluYepudoo SongReleasedFrom RangDeMovie

టాలీవుడ్: తెలుగులో యువ హీరోల్లో లవ్ స్టోరీలు నప్పే హీరోల్లో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం నితిన్ , కీర్తి సురేష్ కాంబినేషన్ లో ‘రంగ్ దే’ అనే సినిమా రూపొందుతుంది. ‘మజ్ను’, ‘తొలిప్రేమ’ లాంటి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్ ని రూపొందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. పూర్తిగా లవ్ మరియు ఫామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం లో రూపొందుతున్న ఈ సినిమానుండి ఒక్కో పాట విడుదల చేస్తూ ప్రొమోషన్ చేస్తున్నారు మూవీ టీం.

ఈ రోజు ఈ సినిమా నుండి ‘నా కనులు ఎపుడూ’ అంటూ సాగే పాటని విడుదల చేసింది సినిమా టీం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం లో సిద్ శ్రీరామ్ గానంతో ఈ పాట ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత దేవి దగ్గరి నుండి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ వచ్చింది. ఈ పాటతో సిద్ శ్రీరామ్ పాట మరొకటి టాప్ లిస్ట్ లో చేరింది. సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మార్చ్ 26 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular