fbpx
Friday, April 26, 2024
HomeMovie Newsఈ వారం రిలీజెస్

ఈ వారం రిలీజెస్

MovieReleases This Week

టాలీవుడ్: ఈ వారం ఓటీటీ లో విడుదల అవ్వబోతున్న సినిమాల నుండి మళ్ళీ థియేటర్లలో సినిమాలు విడుదల హడావిడి గత మూడు వారాలుగా చూస్తున్నాం. ప్రతీ వారం దాదాపు 5 చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ వారం కూడా అందుకు మినహాయింపు ఏమి కాదు. ఈ వారం విడుదల అవ్వబోతున్న సినిమాలు చూద్దాం.

ఈ వారం విడుదల అవుతున్న సినిమాల్లో మంచి బజ్ మరియు గుర్తింపు ఉన్న సినిమా ‘రాజ రాజ చోర’ సినిమా. శ్రీ విష్ణు కొత్త రకమైన కథతో కామెడీ ట్రీట్మెంట్ తో ఈ సినిమా రూపొందించారు. హసిత్ గోలి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాల్లో ఇప్పటి వరకు యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇది. రేపు మొహర్రం సెలవు కావడం తో లాంగ్ వీకెండ్ మరియు మంచి టాక్ కూడా ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం .

ఈ రోజు విడుదలైన మరో సినిమా ‘కనబడుట లేదు’. సీనియర్ నటుడు సునీల్ డిటెక్టీవ్ పాత్రలో ఈ సినిమాలో మెరిశాడు. ప్రమోషన్స్ కూడా అంతగా కనిపించని ఈ సినిమా ఈరోజు విడుదలయింది కానీ మిక్స్డ్ టాక్ తో కొనసాగుతుంది. ఈ రోజు విడుదలైన మరో సినిమా ‘కేజ్రీ అంకుల్స్’. శ్రీ ముఖి మరియు సీనియర్ సింగర్ మనో, సీనియర్ నటుడు రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కామెడీ నే ముఖ్య అంశంగా రూపొందింది. తక్కువ బజ్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ కి తగ్గట్టే అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇవే కాకుండా రేపు మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో సంపూర్ణేష్ బాబు నటించిన ‘బజార్ రౌడీ’ కూడా ఉంది. రెగ్యులర్ సంపూ సినిమాల్లానే సర్కాస్టిక్ కామెడీ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాతో పాటు ‘అవలంబిక’, ‘చేరువైనా దూరమైనా’ అనే మరో రెండు చిన్న సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular