టాలీవుడ్: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ప్రస్తుతం రాబోతున్న సినిమా ‘ఆచార్య’. దేవస్థానాల్లో జరిగే అన్యాయాల నేపథ్యంలో కొరటాల శివ తాలూకు ఒక సోషల్ మెస్సేజ్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదల చేసారు. టీజర్ లో ‘ధర్మస్థలి’ అనే ప్రాంతంలో దేవాలయాలని చూపించి అక్కడ జరిగే కొన్ని తప్పులను ఎదుర్కోవడానికి ఆ ప్రాంతంలో అడుగుపెట్టి ఆ తప్పులని సరిచేసే ఆచార్య పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నట్టు టీజర్ లో తెలిపారు. ‘నేనెప్పుడూ పాటలు చెప్పలేదు.. బహుశా గుణ పాఠాలు చెప్పడం వలన అందరూ నన్ను ఆచార్య అని పిలుస్తారు’ అని చిరు డైలాగ్ తో టీజర్ ముగించారు.
టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాట్రోగ్రాఫర్ తీరు విజువల్స్. టీజర్ లో ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకునేలా ఉంది. తీరు విజువల్స్ తో పాటు ఆ విజువల్స్ లో ఉన్న ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ రూపొందించిన ధర్మస్థలి సెట్స్. రియలిస్టిక్ గా ఉండేలా సెట్స్ రూపొందించారు సురేష్. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ లో మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ ఆకట్టుకుంది. కొరటాల శివ మార్క్ ఫైట్స్ టీజర్ లో కనిపించాయి. ఫైట్స్ ఇదివరకే చూసిన ఫైట్స్ లాగ కనిపించాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి మరియు రామ్ చరణ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సమ్మర్ లో మే 13 న విడుదల చేయనున్నారు