fbpx
HomeMovie Newsశ్రీదేవి సోడా సెంటర్' - మందులోడా సాంగ్ రిలీజ్

శ్రీదేవి సోడా సెంటర్’ – మందులోడా సాంగ్ రిలీజ్

Mandhuloda SongFrom SrideviSodaCenter

టాలీవుడ్: 2020 వ సంవత్సరంలో కరోనా కి కొంచెం ముందు పలాస 1978 అనే సినిమా విడుదలైంది. కరుణ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ దర్శకుడు తన రెండవ సినిమాని సుధీర్ బాబు హీరో గా రూపొందిస్తున్నాడు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ ఆకట్టుకున్నాయి. మణి శర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ‘మందులోడా’ అంటూ సాగే ఈ పాటని ఈ రోజు విడుదల చేసారు. ఈ పాటని మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్.

పలాస లో ‘బావొచ్చాడు’ లాంటి మాస్ పాట బాగా హిట్ అయ్యి క్రేజ్ రావడం తో కరుణ కుమార్ మరోసారి అలాంటి ప్రయత్నమే చేసాడు అని ఈ పాట ద్వారా అర్ధం అవుతుంది. ఒక ఫుల్ మాస్ బీట్ తో ఈ పాట రూపొందింది. ఈ లిరికల్ వీడియో లో డాన్స్ లతో పాటు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో సుధీర్ బాబు కి జోడీ గా ఆనంది నటిస్తున్నారు. 70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చల్లా, శశి దేవి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular