fbpx
HomeMovie News'ఢీ' కాంబినేషన్ లో 'డి అండ్ డి'

‘ఢీ’ కాంబినేషన్ లో ‘డి అండ్ డి’

ManchuVishnu DandD MovieAnnouncement

టాలీవుడ్: మంచు విష్ణు కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ముందుగా ఉండే సినిమా ‘ఢీ’. ఒక విధంగా చెప్పాలంటే విష్ణు కి మొదటి సక్సెస్ కూడా ఈ సినిమా అని చెప్పవచ్చు. శ్రీను వైట్ల, విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్ లో అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా కామెడీ పైన ఇప్పటికీ కూడా సోషల్ మిడిల్ లో మిమ్స్ వస్తుంటాయి. దాదాపు 13 సంవత్సారాల తర్వాత ఈ సినిమా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవబోతుంది. ఈ సారి ‘డి అండ్ డి’ అనే టైటిల్ తో రాబోతున్నారు. డబల్ డోస్ అనే టాగ్ లైన్ జత చేసి ఈ సినిమాలో కామెడీ డబల్ డోస్ ఉంటుందని చెప్పారు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల ఆస్థాన రచయిత గోపి మోహన్ ఈ సినిమాకి శ్రీను వైట్ల తో కలిసి పని చేయనున్నాడు. మణి శర్మ కుమారుడు మహతి సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇపుడు శ్రీను వైట్ల కూడా చేతిలో సినిమాలు లేకపోవడం తో ఈ సినిమాతో ఒక గట్టి హిట్ కొట్టి మళ్ళీ తన పూర్వ ఫామ్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. విష్ణు కూడా గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నప్పటికీ చెప్పుకోదగిన హిట్ అయితే ఎక్కడా రాలేదు. ఈ సినిమా ద్వారా వీళ్లిద్దరు మళ్ళి హిట్ బాట పట్టాలని చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular