fbpx
HomeMovie Newsమేజర్ కోసం టాప్ హీరోస్ అఫ్ ఇండస్ట్రీస్

మేజర్ కోసం టాప్ హీరోస్ అఫ్ ఇండస్ట్రీస్

MajorMovie Teaser ReleasingTomorrow

టాలీవుడ్: టాలీవుడ్ నటుడు అడివి శేష్ హీరో గా ఇండియన్ ఆర్మీ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ‘మేజర్’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా స్టోరీ పాన్ ఇండియా రేంజ్ ఉంది కాబట్టి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్ ని రేపు విడుదల చేయనున్నారు. కానీ విశేషం ఏంటంటే ఈ సినిమా టీజర్ ని వేరు వేరు భాషల్లో ఆయా భాషల్లోని టాప్ లీగ్ ఆక్టర్స్ విడుదల చేయనున్నారు.

మేజర్ సినిమా టీజర్ ని తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. హిందీ లో సల్మాన్ ఖాన్ విడుదల చేయనున్నారు. మలయాళం లో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమా టీజర్ ని ఒకేసారి విడుదల చేయనున్నారు.

26 /11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం లో పడిన కష్టాలని, సాధించిన విజయాల్ని, తన చివరి క్షణాల్ని అన్నీ బాగా రీసెర్చ్ చేసి ఈ సినిమా రూపొందిస్తున్నారు మూవీ మేకర్స్. గూఢచారి సినిమాని డైరెక్ట్ చేసిన శశి కిరణ్ తిక్క ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా టీజర్ ని ఆల్రెడీ చూసిన నాని ఈ సినిమా టీజర్ చాలా అద్భుతంగా ఉందని ఈ మధ్య కాలంలో ఇలాంటి టీజర్ ని చూడలేదని పొగిడాడు. ఈ సినిమాని జి.ఎం.బి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, A + S సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని జులై 2 న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular