fbpx
HomeMovie Newsఓటీటీ లో విడుదలవుతున్న మాధవన్ మరో సినిమా

ఓటీటీ లో విడుదలవుతున్న మాధవన్ మరో సినిమా

Madhavan MaaraMovie ReleasingOnAmazonPrime

కోలీవుడ్: ఈ మధ్యనే మాధవన్ , అనుష్క జంటగా నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. సినిమా టాక్ పరంగా అయితే నిరాశ పరచింది. మాధవన్ ఇలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నాడు అని చాలా మంది విమర్శలు కూడా చేసారు. ఇపుడు మాధవన్ నటించిన మరొక సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల అవబోతుంది. మాధవన్ మరియు జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన తమిళ్ మూవీ ‘మారా’. ఈ సినిమా డిసెంబర్ 17 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవబోతుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు ‘విక్రమ్ వేద’ సినిమా వచ్చి హిట్ గా నిలిచింది.

2015 లో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘చార్లీ’ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందింది. చార్లీ సినిమాకి వేరే భాషల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. మానవ సంబంధాల ఆధారంగా రూపొందిన ఈ సినిమా చాలా మంచి ఆదరణ తో పాటు చాలా అవార్డులు కూడా పొందింది. ప్రమోద్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాని దిలీప్ అనే నూతన దర్శకుడు రూపొందించాడు. నిశ్శబ్దం ద్వారా విమర్శలు పొందిన మాధవన్ ఈ సినిమా ద్వారా తన అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే కాకుండా మాధవన్ డైరెక్టర్ గా మరో సినిమా చేస్తున్నాడు. రాకెట్రీ మాన్ ‘నంబి ఎఫెక్ట్’ అనే రియల్ లైఫ్ స్టోరీ తో దర్శకుడిగా మాత్రమే కాకుండా నంబి పాత్రలో స్వయంగా మాధవన్ నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular