fbpx
Sunday, October 2, 2022

INDIA COVID-19 Statistics

43,403,319
Confirmed Cases
Updated on June 27, 2022 1:08 am
524,999
Deaths
Updated on June 27, 2022 1:08 am
105,922
ACTIVE CASES
Updated on June 27, 2022 1:08 am
42,772,398
Recovered
Updated on June 27, 2022 1:08 am
HomeMovie Newsకీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' అప్డేట్

కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ అప్డేట్

KeerthiSuresh GoodluchSakhi MovieUpdate

టాలీవుడ్: ‘మహానటి’ సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. తాను తీసే సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా చేస్తుంది. దాదాపు అన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది. పెంగ్విన్, మిస్ ఇండియా ఇప్పుడు అదే కోవలో ‘గుడ్ లక్ సఖి’ అనే సినిమా చేస్తోంది. గ్లామర్ పాత్రలకి తక్కువగా చేస్తూ నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది ఈ హీరోయిన్. ఈ చిత్రం లో కీర్తి సురేష్ పోస్టర్ ఒకటి విడుదల చేసారు ఈ సినిమా టీం. అలాగే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్ ని ఆగష్టు 15 న విడుదల చేయబోతున్నట్టు ఈ సినిమా టీం ప్రకటించింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు.

బాలీవుడ్ లో కొన్ని విలక్షణమైన చిత్రాలు తీసి చాలా అవార్డులు పొందిన దర్శకుడు నగేష్ కుకునూర్. తన సినిమాలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు చాలా అందుకున్నాయి. ఈయన దర్శకత్వం లోనే రాబోతున్న సినిమా ‘గుడ్ లక్ సఖి’. దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాని ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల బ్రేక్ పడింది. పరిస్థితులు మెరుగు పడగానే మిగతా షూటింగ్ పూర్తి చేసుకొని సినిమాని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు ఈ సినిమా మేకర్స్. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో సిద్ధం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular