fbpx
Tuesday, April 16, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsరాశి ఖన్నా విడుదల చేసిన 'జోహార్' ట్రైలర్

రాశి ఖన్నా విడుదల చేసిన ‘జోహార్’ ట్రైలర్

JoharMovie TrailerRelaseBy RaashiKhanna

టాలీవుడ్: కొత్త దనంతో వచ్చే దర్శకులకి, టెక్నిషియన్స్ కి ఓటీటీలు మంచి దారిని చూపిస్తున్నాయి. 5 గురు వివిధ నేపధ్యాలు ఉన్న వ్యక్తుల కథలని చూపిస్తూ ఒక సినిమా ‘ఆహ’ ఓటీటీ లో విడుదలకి సిద్ధంగా ఉంది. ఆ సినిమానే ‘జోహార్’. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా విడుదల చేసారు. ఈ సినిమాకి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నిజ జీవిత కథలు, కొన్ని కల్పిత కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం ఒకటి, పొట్టకూటి కోసం సర్కస్ చేస్తూ అథ్లెట్ అవ్వాలనుకునే ఒక రన్నర్, పాఠాలు చెప్పాలనుకుంటాడు కానీ కనీస వసతులు లేని ఒక ఒక పేద టీచర్, వేశ్య కుటుంబం లో ఉన్న స్టూడెంట్, తండ్రి చనిపోయిన తర్వాత వారసత్వంతో ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రమంతా తన తండ్రి విగ్రహాలే పెట్టించడం లక్ష్యం గా పెట్టుకున్న ఒక యువ రాజకీయ నాయకుడు. ఇవి ఈ సినిమాలోని ముఖ్య పాత్రలు. పారలెల్ నరేషన్ కథలు ఇదివరకే చాలానే వచ్చినప్పటికీ సినిమా కథనం, పాత్రల కథలు వైవిద్యం గా చూపించగలిగితే సినిమా సక్సెస్ అవుతుంది. ట్రైలర్ ద్వారా మాత్రం ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు ఈ సినిమా డైరెక్టర్.

ఇద్దరు ముగ్గురు తెలిసిన నటులు తప్ప అందరూ కొత్త నటులే నటించడం ఈ సినిమా విశేషం. ట్రైలర్ వరకు ఆకట్టుకుంది మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే 14 ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే. ఆగస్టు 14 న ఈ సినిమా అల్లు వారి ‘ఆహ’ ఓటీటీ లో విడుదల కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular