fbpx
HomeMovie Newsఅండర్ కవర్ ఆపరేషన్ లో కార్తికేయ

అండర్ కవర్ ఆపరేషన్ లో కార్తికేయ

KarthikeyaGummakonda 7thMovie ConceptPoster

టాలీవుడ్: RX100 సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘కార్తికేయ గుమ్మకొండ’. ప్రస్తుతం ఈ హీరో వరుసపెట్టి సినిమాలని చేస్తున్నాడు. RX100 సినిమా తర్వాత గుణ 369 , హిప్పీ, 90ml లాంటి ప్లాప్ లను ఎదుర్కొన్నాడు. మధ్యలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా నటించి కూడా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో గీత ఆర్ట్స్ 2 వారితో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. అలాగే మరొక సినిమాలో కూడా ఈ హీరో నటిస్తున్నట్టు నిన్న ప్రకటించాడు. ఇందులో ఈ హీరో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఒక అండర్ కవర్ కాప్ రోల్ లో చేయనున్నట్టు టీం ప్రకటించింది.

పోకిరి సినిమా తర్వాత ఇలాంటి పాత్రలకి బాగా క్రేజ్ వచ్చింది. కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చిన హీరోలు ఇలాంటి పాత్రలు చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ఒక కేసు చుట్టు తిరుగుతుందని తాజాగా విడుదల అయిన పోస్టర్ ను బట్టి అర్థం అవుతుంది. ఆ కేసు ఏంటీ, ఈ సినిమా టైటిల్ ఏంటీ, ఇతర విషయాలు త్వరలో వెళ్లడి చేస్తాం అన్నట్లుగా పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. శ్రీ సారిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు తమిళ్ లో అజిత్ తో పాటు ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఆఫీషియల్ ప్రకటన అయితే ఏమీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular