fbpx
HomeMovie News'బింబిసార' గా కళ్యాణ్ రామ్

‘బింబిసార’ గా కళ్యాణ్ రామ్

KalyanRam BimbiSara MovieAnnouncement

టాలీవుడ్: నందమూరి వారసుడిగా హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా అతనొక్కడే, పటాస్, కత్తి సినిమాల సక్సెస్ తోనే కెరీర్ నడిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఎంత ప్రయత్నించినా కూడా కళ్యాణ్ రామ్ సినిమాకి ఎక్కడో ఎదో లోపం ఏర్పడి సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. ఈ సారి కొంత గాప్ తీసుకుని ఒక టైం ట్రావెల్ మరియు చారిత్రాత్మక కథతో రానున్నట్టు అర్ధం అవుతుంది. రెండు రోజుల క్రితం చెప్పినట్టు గానే ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా కళ్యాణ్ రామ్ సినిమాకి సంబందించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది సినిమా టీం.

‘బింబిసార’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందించనున్నట్టు టైటిల్ పోస్టర్ తో పాటు కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది సినిమా టీం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వశిష్ట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవనున్నాడు. ఈ సినిమా గురించి ఇంతకముందు టైం ట్రావెల్ అని మెన్షన్ చేసారు కానీ ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో అలాంటిది ఏమి మెన్షన్ చెయ్యలేదు. ఇక పోస్టర్ లో ఒక యుద్ధం జరిగిన తర్వాత శత్రువులందరిని చంపి వాళ్ళని సింహాసనం లాగ పేర్చి దానిపై రాజులా కూర్చున్న కళ్యాణ్ రామ్ ని చూపించారు. ఎడిటింగ్ పరంగా పోస్టర్ క్వాలిటీ అంతగా లేనప్పటికీ సినిమా అయినా బాగుంటుందని ఆశిద్దాం. ఈ సారి కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ కథతో వస్తాడని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular