fbpx
Sunday, April 28, 2024
HomeMovie News'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' టీజర్

‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ టీజర్

IntheNameOfGod Teaser Release

టాలీవుడ్: కరోనా కారణంగా ఓటీటీలు ఊపందుకుంటున్నాయి. తెలుగులో ఆహా ద్వారా ఓటీటీ కంటెంట్ ఎక్కువగా బయటకి వస్తుంది. ఓటీటీ కోసం సెపెరేట్ కంటెంట్ కి తయారు చేసి విడుదల చేస్తున్నారు ఆహా వాళ్ళు. ఇక ఓటీటీ లో వచ్చే సిరీస్ లలో , సినిమాల్లో నటిస్తూ ప్రియదర్శి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ‘మెయిల్’, ‘లూసర్’ లాంటి సిరీస్ ల ద్వారా విలక్షణమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుని దూసుకెళ్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ‘రూమ్ నంబర్ 54 ‘ లో కూడా ఒక చిన్న పాత్ర వేసాడు. ఇపుడు మరోసారి ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే సిరీస్ లో నటించాడు. ఈ రోజు ఈ సిరీస్ టీజర్ విడుదలైంది.

జగపతి బాబు వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభం అయింది. ఒక వ్యక్తి ని క్రైం వరల్డ్ లోకి ఎలా లాక్కొస్తారని జగపతి బాబు వాయిస్ లో బ్యాక్ గ్రౌండ్ లో ప్రియదర్శి సీన్స్ తో మొదటి సీన్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఈ సిరీస్ లో ప్రియదర్శి తో పాటు బిగ్ బాస్ ఫేమ్ ‘నందిని రాయ్’ నటిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందినట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది. మధ్యలో మెడికల్ మాఫియా, డ్రగ్స్ లాంటి సీన్స్ చివర్లో ఒక మతానికి సంబందించిన సీన్స్ తో టీజర్ ద్వారా ఆసక్తి క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు మేకర్స్. ‘ఆహా’ ఓటీటీ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవనుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని విద్యాసాగర్ ముత్తుకుమార్ అనే నూతన దర్శకుడు రూపొందించారు. జూన్ నెలలో ఈ సిరీస్ స్ట్రీమ్ అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular