విశాఖపట్నం: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా సిరీస్ లో ఎట్టకేలకు భారత్ ఓటములకు బ్రేక్ పడిండి. భారత బౌలర్లు హర్షల్ పటేల్ (4/25), చహల్ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడవ టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్ లో కూడా టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు ఇషాన్ కిషన్ (54), రుతురాజ్ గైక్వాడ్ (57) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 179 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
కాగా ఛేదనలో సఫారీలు భారత బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో కేవలం 131 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెస్ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. సిరీస్ గెలవాలంటే భారత్ తదుపరి రెండు మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది.