హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా స్థాపించిన మహిళా వర్సిటీకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టినట్లు కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.విజ్జులత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా 98 సంవత్సరాల పాటు కొనసాగిన కోఠి మహిళా కాలేజీ ఈ విద్యా సంవత్సరం (2022–23) నుండి తెలంగాణ మహిళా యూనివర్సిటీ(టీఎంయూ)గా మారడం తో పాలన వ్యవహారాలు కూడా బదిలీ అవనున్నాయి. కోఠి మహిళా కాలేజీలో కొనసాగుతున్న బోధన, బోధనేతర సిబ్బంది ఓయూకు వచ్చేందుకు వీలుగా ఇటీవల జరిగన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అయితే నూతన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి ఇంకా వీసీని నియమించాల్సి ఉంది. వీసీని నియమించనందున వర్సిటీలో చేపట్టాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇక మహిళా వర్సిటీ పరిధిలోని కాలేజీల సంఖ్య, కోర్సుల వివరాలు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.