fbpx
HomeMovie Newsప్రయోగాత్మక సినిమాతో రానున్న హన్సిక

ప్రయోగాత్మక సినిమాతో రానున్న హన్సిక

Hansika 105Minutes Movie

కోలీవుడ్: ప్రతీ సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మక సినిమాలు వస్తూ ఉంటాయి. కమల్ హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ మూకీ సినిమాగా ఒక ప్రయోగం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నం ఇంకెవరు చెయ్యలేదు. ఈ మధ్య చెప్పుకోవాలంటే 2019 లో తమిళ నటుడు పార్తిబన్ ‘ఓత్థ సెరుప్పు సైజు 7 ‘ (సింగిల్ స్లిప్పర్ సైజు 7 ) అనే ప్రయోగాత్మక సినిమాని సొంత దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమా మొత్తంలో పార్తిబన్ ఒక్కడే నటించాడు. ఇంకో కారెక్టర్ అనేదే లేకుండా ఈ సినిమా రూపొందించాడు. ఈ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ కూడా లభించాయి.

ప్రస్తుతం హన్సిక కూడా అలాంటి ప్రయత్నమే ఒకటి చేస్తుంది. హన్సిక ప్రస్తుతం ‘105 మినిట్స్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి అంటే ఈ సినిమాలో హన్సిక పాత్ర తప్ప ఇంకో పాత్ర ఉండదు. మరొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ సినిమా సింగిల్ షాట్ మూవీ గా సెట్ లలో కాకుండా రియలిస్టిక్ గా రూపొందనుంది. రుద్రాంష్ సెల్యులాయిడ్ బ్యానర్ పై బొమ్మక్ శివ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాజు దుస్స అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించనున్న ఈ సినిమాని షూటింగ్ మొదలుపెట్టినట్టు ప్రకటించి పోస్టర్ విడుదల చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular