fbpx
Monday, April 29, 2024
HomeMovie Newsబ్రహ్మాజీ హీరోగా 'హ్యాంగ్ మాన్' ఫస్ట్ లుక్

బ్రహ్మాజీ హీరోగా ‘హ్యాంగ్ మాన్’ ఫస్ట్ లుక్

Hangman MovieFirstLookWith BrahmaajiAsMainLead

టాలీవుడ్: టాలీవుడ్ లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరున్న నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సిందూరం సినిమాలో హీరోగా కూడా చేసాడు. కానీ అంతగా క్లిక్ అవకపోవడం తో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగాడు. వయసు 50 దాటినా కూడా ఏజ్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో ఒక కొత్త సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ఇవాల విడుదలైంది. ‘హ్యాంగ్ మాన్ ‘ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్లో ఒక ఏజెడ్ కారెక్టర్ లో చేతిలో చేపలు పట్టుకుని ఏదో మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తున్నాడు బ్రహ్మాజీ.

అయితే ఎలాంటి ప్రచారం లేకుండా, సినిమా షూటింగ్ ఎపుడు మొదలైందో కూడా తెలియకుండా సడన్ గా ఫస్ట్ లుక్ విడుదలయ్యే సరికి అందరి అటెన్షన్ ఈ సినిమా పైన పడింది. సినిమా లో బ్రహ్మాజీ లుక్ మాత్రమే కాకుండా టైటిల్ కూడా కొత్తగా ఉండడం తో ఏదో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ లాగా అనిపిస్తుంది. పేరును బట్టి ఒక జైల్లో ఖైదీ లని ఉరి తీసే ఒక వ్యక్తి కథ లాగా కూడా అనుకోవచ్చు అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ మరేమైనా అప్డేట్ వచ్చే వరకు అలాంటివి ఊహాగానాలలాగానే ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సత్యదేవ్ విడుదల చేసి తన వంతుగా బ్రహ్మాజీ కి బెస్ట్ విషెస్ తెలియచేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular