fbpx
Saturday, April 27, 2024
HomeMovie Newsగోపీచంద్ తో మారుతి సినిమా

గోపీచంద్ తో మారుతి సినిమా

GopichandAndMaruthi NewMovie Announcement

టాలీవుడ్: ‘ఈరోజుల్లో’ వంటి చిన్న సినిమాతో హిట్ సినిమా తీసి కామెడీ , యూత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి. మొదట్లో యూత్ కంటెంట్ సినిమాలు ఎక్కువగా తీసి విమర్శల పాలై ఆ తర్వాత నాని తో భలే భలే మగాడివోయ్ లాంటి సూపర్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా తీసి కంబ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత హీరో కి ఎదో ఒక లోపం ఉన్న సినిమాల ద్వారా హిట్ లు తీసాడు. చివరగా సాయి ధరమ్ తేజ్ తో ‘ప్రతి రోజు పండగే’ లాంటి ఫామిలీ మూవీ తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్ మొదటి సారి ఒక యాక్షన్ హీరో తో జత కట్టనున్నాడు.

హీరో కన్నా విలన్ గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్న నటుడు ‘గోపీచంద్‘. ప్రస్తుతం గోపీచంద్ మారుతీ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నాయి. యూవీ క్రియేషన్స్ తో గోపిచంద్ కి ‘జిల్’ తర్వాత ఇది రెండవ సినిమా. ఈ సినిమా ప్రకటనకు సంబంధించి రావు రమేష్ వాయిస్ ఓవర్ తో చిన్న వీడియో కూడా విడుదల చేసారు. గోపీచంద్ 29 వ సినిమాగా మరియు మారుతీ కి 10 వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు కొద్దీ రోజుల్లో తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular