fbpx
HomeBusinessమళ్ళీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు!

మళ్ళీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు!

GOLD-PRICES-FELL-DOWN-RECORD-LEVEL

హైదరాబాద్: గత సంవత్సరం భారీగా పెరిగిన బంగారం ధరలతో కొనుగోలుదారులు షాక్‌ గురయ్యారు, కాగా ఈ ఏడాది ఇటు ఫ్యూచర్‌ మార్కెట్‌ మరియు ఆభరణాల మార్కెట్‌లో బంగారం ధరలు బాగా తగ్గాయి. పోయిన సంవత్సరం నమోదైన రికార్డు స్థాయి గరిష్ట ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం బంగారం ధర భారీగా పడిపోయినట్లయింది.

తాజాగ తగ్గిన ధరలతో బంగారం ధరలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,500లకు చేరింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,070లు సెప్టెంబరు 11న నమోదయ్యింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే బంగారం ధర దాదాపుగా రూ. 600ల వరకు తగ్గింది.

ఇదిలా ఉండగా పెట్టుబడికి ఉపయోగించే 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,000ల స్థాయికి పడిపోయింది. సెప్టెంబరు 11న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,070గా ట్రేడ్‌ అవ్వగా, తాజాగా తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం ధర రూ. 43,400లకి చేరుకుంది.

2020 ఆగస్టులో హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 వరకు ఎగసింది, అయితే ఇప్పుడు ఆ ధరతో పోల్చితే ప్రస్తుతం రూ. 11 వేల వరకు బంగారం ధర తగ్గినట్లే. ప్యూచర్‌ గోల్డ్‌కి సంబంధించి ఈ వత్యాసం రూ. 10,.900లుగా ఉంది. అలాగే వెండి రేటు కూడా భారీగా తగ్గింది. 2020 ఆగస్ట్ 7న కిలో వెండి ధర రూ.76,150లుగా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.63,500గా ట్రేడ్‌ అవుతోంది. గరిష్ట ధర నుంచి సుమారు రూ.12,650 వరకు వెండి ధర తగ్గింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular