న్యూఢిల్లీ: ఇటీవలే ఏడుగంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన విషయం ఇంకా యూజర్లు మరచిపోకుండానే ఇప్పుడు తాజాగా భారత్‌లో జీమెయిల్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో జీమెయిల్ సేవలు డౌన్ అయ్యాయని మధ్యాహ్నం దాదాపు మూడు గంటల నుండి జీమెయిల్ సేవలు పనిచేయ లేదంటూ ట్విటర్ వేదికగా వినియోగదార్లు గగ్గోలు పెట్టారు. ఊక్లాకు చెందిన డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్‌లో సుమారు 68 శాతం మంది యూజర్లు జీమెయిల్ పనిచేయడం లేదంటూ ఫిర్యాదు చేశారు.
ఈ 68 శాతం లో 18 శాతం మంది యూజర్లు సర్వర్ సమస్యలను, 14 శాతం మంది లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నట్లు డౌన్ డిటెక్టర్‌లో వెల్లడించింది. కొంత మంది యూజర్లు #జీమెయిల్డౌన్ పేరిట ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా నిలిచిపోయిన జీమెయిల్ సేవలపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. గూగుల్ ఈ సమస్యలకు పరిష్కారం వెంటనే గూగుల్ చూస్తోందని యూజర్లు భావిస్తున్నారు.