fbpx
Saturday, April 27, 2024
HomeMovie Newsలవ్ స్టోరీలనే నమ్ముకున్న పెద్ద బ్యానర్

లవ్ స్టోరీలనే నమ్ముకున్న పెద్ద బ్యానర్

GeethaArts Producing LoveStories

టాలీవుడ్: అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ అందరికి సుపరిచితమే. దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఈ నిర్మాణ సంస్థ నుండి గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. పెద్ద పెద్ద సినిమాలు నిర్మించే ఈ సంస్థ చిన్న సినిమాల కోసం GA2 అనే అనుబంధ సంస్థని స్థాపించి అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో సినిమాలని నిర్మిస్తుంది.

మొదట్లో హిట్ సినిమాలని నిర్మించి గీతా ఆర్ట్స్ పేరుని నిలిపిన ఈ సంస్థ కొద్దిగా స్లో అయింది అని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ప్రస్తుతం ఈ బానర్ కేవలం ప్రేమ కథలనే నమ్ముకుని ముందుకు సాగుతుంది. మగధీర, బద్రీనాథ్ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి పెద్ద సినిమాలు రాలేదు. GA2 బ్యానర్ నుండి ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ దాదాపు ప్రేమకథలు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘18 పేజెస్‘, ‘ప్రేమ కాదంట’ ఇలా అన్ని సినిమాలు ప్రేమ కథలే ఉన్నాయ్. గోపి చంద్ తో ‘పక్కా కమర్షియల్’ కొంచెం లవ్ మరియు కామెడీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ‘చావు కబురు చల్లగా’ తో ప్లాప్ చవి చూడడం మాత్రమే కాకుండా విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యానర్ మున్ముందు కొత్త రకమైన సినిమాలని ఎంచుకునే మార్గాల్లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular