fbpx
HomeMovie Newsడుల్కర్ 'సెల్యూట్' ఫస్ట్ లుక్

డుల్కర్ ‘సెల్యూట్’ ఫస్ట్ లుక్

DulquerSalman SaluteMovie FirstLook

మాలీవుడ్: మమ్ముట్టి వారసుడిగా హీరోగా ఆరంగేట్రం చేసి తండ్రి కన్నా ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్న నటుడు డుల్కర్ సల్మాన్. కేవలం మళయాళం ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ పెంచుకున్నటున్న నటుడు డుల్కర్ సల్మాన్. ఇదివరకే బాలీవుడ్, కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరో ప్రస్తుతం హిందీ లో మరో డైరెక్ట్ సినిమా, తెలుగు లో కూడా స్వప్న సినిమాస్ బ్యానర్ లో మహానటి తర్వాత మరో డైరెక్ట్ తెలుగు మూవీ లో నటిస్తున్నాడు. ఇవే కాకుండా మలయాళం లో ‘కురూపి’ అనే సినిమాని విడుదలకి సిద్ధం చేసాడు. ఈ సినిమాని సౌత్ లో అన్ని భాషల్లో విడుదల చెయ్యబోతున్నారు.

ఇవే కాకుండా ప్రస్తుతం ‘సెల్యూట్’ అనే మరో మలయాళం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం. ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు డుల్కర్. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ నటిస్తుంది. వే ఫెరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై డుల్కర్ సొంత నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. సంజయ్ మరియు బాబీ ఈ సినిమాకి కథ అందించగా రోషన్ అంద్రూస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చివరి దశకి వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి ప్రొమోషన్ మొదలు పెట్టింది సినిమా టీమ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular