fbpx
HomeMovie Newsఆసక్తికరంగా దృశ్యం 2

ఆసక్తికరంగా దృశ్యం 2

Drishyam2 RunningWith InterestingScreenPlay

మాలీవుడ్: తెలుగు లో వెంకటేష్ హీరోగా ‘దృశ్యం’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ విడుదలైన విషయం తెల్సిందే. కానీ దీని మాతృక మలయాళం లో మోహన్ లాల్ హీరోగా రూపొందింది. ఈ సినిమాకి సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా రూపొందింది. దాదాపు మొదటి పార్టీలో నటించిన నటులతోనే రూపొందిన ఈ సినిమా ఈ రోజు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. మామూలుగా సీక్వెల్ కి వేరే కథలని ఎంచుకుని తీస్తుంటారు. కానీ ఈ సినిమా మొదటి పార్ట్ కి కొనసాగింపుగా ఉంటుంది.

సినిమా ప్రారంభం అయిన కొద్దీ సేపటికి బోర్ కొట్టినట్టు అనిపిస్తున్నా కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ సినిమా పైన ఆసక్తి ప్రారంభం అవుతుంది. చివరకి హీరో తన కుటుంబాన్ని కాపాడుకుంటాడా లేదా, కాపాడుకుంటే ఎలా కాపాడుకుంటాడు అనే ఆసక్తి తో సినిమా ముందుకు వెల్తూ ఉంటుంది. అంతే కాకుండా మొదట్లో బోర్ అనిపించిన ప్రతీ సీన్ కి సినిమా చివర్లో కారణాలు చూపిస్తూ ఉంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమా క్లైమాక్స్. డైరెక్టర్ జీతూ జోసెఫ్ రాసుకున్న కథని అద్భుతమైన కథనం తో చక్కగా ప్రెసెంట్ చేసారు.

ఈ సినిమా ప్రైమ్ ఓటీటీ లో కేవలం మలయాళం భాషలో మాత్రమే విడుదలైనా కానీ ఆల్రెడీ ఈ సినిమా మొదటి భాగం అన్ని భాషల్లో విడుదలవడం తో రెండవ పార్ట్ కోసం చాలా మంది సినీ అభిమానులు సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ సినిమాని ఎంజాయ్ చేసారు. సినిమా టాక్ కూడా మంచిగా ఉండడం తో వ్యూయర్షిప్ కూడా పెరిగింది. రెండవ పార్ట్ కూడా సూపర్ హిట్ అవడం తో తెలుగు లో వెంకటేష్ తో ఈ రెండవ పార్ట్ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే వెంకటేష్ రీమేక్ సినిమాలకే మొగ్గు చూపుతూ ఉండడం తో ఈ సినిమా గురించి త్వరలోనే తెలుగు రీమేక్ వార్త వినబోతున్నాం అనుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular