fbpx
Saturday, July 27, 2024
HomeBusinessమార్కెట్లో ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ పేరుతో చాక్లెట్‌!

మార్కెట్లో ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ పేరుతో చాక్లెట్‌!

DHONI-COPTER-7-CHOCOLATES-FROM-7INKBREWS

ముంబై: కార్పొరేట్ కంపెనిల్లో మార్కెటింగ్ కి ఎన్నో కొత్త కొత్త దారులు వెతుక్కుంటుంటారు. తాజాగా ఇలాంటిదే ఒకటి జరిగింది. మార్కెట్‌లో కొంచం ఫేమ్‌, నేమ్‌ ఉంటే చాలు దాని ఆధారంగా వ్యాపారం‌ చేయడానికి చాలా మార్గాలే దొరకుతాయి. ఈ పద్ధతిను​ ఇప్పడు ‘7 ఇంక్‌బ్రూస్‌’ అనే ఒక చాక్లెట్‌ కంపెనీ పాటిస్తోంది.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన‌ మహేంద్ర సింగ్‌ ధోనీ పేరుతో ఈ కంపెనీ తన చాక్లెట్లను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. ధోనీకి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను ఇలా ఆ కంపెనీ వారు ఇలా మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోని ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే తను సంపాధించుకున్న క్రేజ్‌ కూడా.

అందులోనూ ధోనీ ఆట అంటే ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేది వైవిధ్యమైన అతని హెలికాప్టర్‌ షాట్‌. ఈ షాట్ కు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. కనుకే ముంబైకి చెందిన ‘7 ఇంక్‌బ్రూస్’‌ అనే పుడ్‌ అండ్‌ బెవరేజస్‌ స్టార్టప్ కంపెనీ‌, తయారు చేస్తున్న చాక్లెట్లకు ‘కాప్టర్ 7’ అని పేరు పెట్టింది. ఇక వాటి ప్యాకేజింగ్, లేబులింగ్ వంటివి ఈ చాక్లెట్‌కు అదనపు అందాన్ని జోడించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అలాగే ఇది ధోని విభిన్న జెర్సీలు వాటి రంగులతో వీటి లేబుల్‌ను తయారు చేస్తున్నారు. వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ భగ్‌చందని మాట్లాడుతూ ధోనీ లక్షణమైన “అన్‌డైయింగ్ ‘కాన్ట్‌ స్టాప్, వోన్‌ట్‌ స్టాప్’ స్పిరిట్ ’ క్యాప్షన్‌ ను బ్రాండ్గా వాడాలని చూస్తున్నారు.

ఇప్పటికే ఇవి ముంబై, గోవా, బెంగుళూరులో అందుబాటులలోకి రాగా, త్వరలో జార్ఘండ్‌​, యూపీ, హర్యానా, పంజాబ్‌ లోనూ దొరకనున్నట్లు తెలిపారు. ఈ కంపెనీలో ధోనీ కూడా భాగస్వామ్యం కావడం విశేషం. 7 ఇంక్ బ్రూస్ వంటి సంస్థకు వాటాదారునిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం నాకు నిజంగా సంతోషంగా ఉందంటూ ” పత్రికా ప్రకటనలో ధోని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular