fbpx
Thursday, April 18, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeAndhra Pradeshకార్పొరేట్ వసతుల తో ప్రభుత్వ ఆసుపత్రులు

కార్పొరేట్ వసతుల తో ప్రభుత్వ ఆసుపత్రులు

CORPORATE-STYLE-GOVERNMENT-HOSPITALS-IN-AP

అమరావతి: రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తరహా అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని, భవన నిర్మాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్‌ లుక్‌ ఖచ్చితంగా కనిపించాలని స్పష్టం చేశారు.

వైద్య ఆరోగ్య శాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పనులతో పాటు కొత్తగా వైద్య కళాశాలలు, ఐటీడీఏల్లో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు ఇచ్చిన ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

డాక్టర్లు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే చక్కగా సేవలందించగలుగుతారని, అందువల్ల తప్పనిసరిగా సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉండాలని సీఎం చెప్పారు. అవసరం అయితే సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, దాని వల్ల యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.50కే వస్తుందని చెప్పారు. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయని, అందువల్ల ప్రతి ఆస్పత్రి అత్యుత్తమంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తొలుత నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. పాడేరులో వైద్య కళాశాలతో పాటు, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను అక్టోబర్‌ 2న ప్రారంభిస్తారని (సీఎం ప్రారంభిస్తారు) చెప్పారు.

ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, హెల్త్‌ మెడికల్‌ హౌసింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular