fbpx
Saturday, July 27, 2024
HomeAndhra Pradeshవైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

CORONA-POSITIVE-FOR-AMBATI-RAMBABU

అమరావతి: ఏపీ లో కరోనా తన ఖాతాలో మరో ఎమ్మెల్యేను చేర్చుకుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సినిమా తారలకు సొకిన కరోనా, తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి కూడా సోకింది.

అంబటి రాంబాబు ఒక సెల్ఫీ వీడియోలో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, నేను ధైర్యంగా ఉన్నానని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు, ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయం తెలిసిన చాలా మంది శ్రేయోభిలాషులు కాల్స్‌ చేస్తున్నారు. నాపై అభిమానం చూపిస్తున్నందుకు ధన్యవాధాలు. కానీ నేను ఐసోలేషన్‌లో ఉండటం వల్ల ఎవ్వరికీ సమాధానం ఇవ్వలేకపోతున్నాను. ఒక ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ధైర్యంగా ఉన్నాను, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉదయమే నాకు కరోనా సోకినట్టుగా నిర్దారణ అయింది. త్వరలోనే సంపుర్ణ్ ఆరొగ్యంతో కోలుకుని మీ ముందుకు వస్తాను’ అని అంబటి రాంబాబు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular