fbpx
Sunday, April 28, 2024
HomeMovie News'అరణ్య': చిటికేసే చిరుగాలి పాట విడుదల

‘అరణ్య’: చిటికేసే చిరుగాలి పాట విడుదల

ChitikeseChirugali SongReleasedFrom RanaAranyaMovie

టాలీవుడ్: టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన రానా నటించిన ‘అరణ్య‘ సినిమా విడుదలకి సిద్ధం అవుతుంది. నిన్ననే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. ఈరోజు ఈ సినిమా నుండి ‘చిటికేసే చిరుగాలి’ అంటూ సాగే పాటని విడుదల చేసారు. అడవిని, ప్రకృతిని, జంతువులని కాపాడే బల్దేవ్ పాత్రలో రానా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఈ పాటలో కూడా అదే చూపించారు. అడవి అందాల్ని, ప్రకృతి ని, అడవిలో జనాల బ్రతుకులని కాపాడే ఒక నాయకుడి పాత్రలో రానా ని చూపించారు. అలాగే విష్ణు విశాల్ మరియు నక్సలైట్ రిలేటెడ్ ఎపిసోడ్స్ ని కూడా కొన్ని ఈ పాటలో చూపించారు. ఓవరాల్ గా నేచర్ కి సంబందించిన షాట్స్ తో ఈ పాట ఆకట్టుకుంది.

ప్రభు సోలమన్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది. ‘గజరాజు’ లాంటి సినిమాని రూపొందించిన ఈ డైరెక్టర్ మరోసారి ఏనుగులు, అడవి లాంటి కాన్సెప్ట్ తోనే కమర్షియల్ గా కాకుండా ఎడ్యుకేట్ చేసే పంథాలో రూపొందించాడు. ఇలాంటి సినిమాలు చాలా అరుదు. ఎరోస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. మార్చ్ 26 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular