fbpx
HomeMovie Newsప్రభాస్ సినిమా కోసం ఆడిషన్స్

ప్రభాస్ సినిమా కోసం ఆడిషన్స్

CastingCall ForPrabhasAndNagAshwin Movie

టాలీవుడ్: పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గ ఉన్నాడు. ఈ మధ్యనే సాలార్, ఆదిపురుష్ షూటింగ్ లు కూడా మొదలు పెట్టాడు. సాలార్ సినిమా కోసం ఒక రెండు నెలల క్రితం హైదరాబాద్ లో బెంగళూరు లో ఆడిషన్స్ జరిగాయి. ఇపుడు ప్రభాస్ చేయబోతున్న మరో సినిమా కోసం ఆడిషన్స్ చేయనున్నట్టు ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ సినిమాని రూపొందించే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్ లో ఉంటుందని ఇదివరకే తెలిపారు.

ఈ సినిమా కోసం ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ కాంస్టింగ్ కాల్ అంటూ ఆడిషన్స్ కి ఆహ్వానించింది. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం ఆడిషన్ కాల్ పోస్టర్ ఒకటి విడుదల చేసి అందుకు కావాల్సిన అర్హతలు కూడా పెట్టారు. 9 నుండి 14 ఏళ్ల అమ్మాయిలు ఎనర్జిటిక్ డ్యాన్సర్స్ జిమ్నాస్టిస్ కావాలంటూ తెలిపారు. 20 నుండి 35 ఏళ్ల అబ్బాయిలు డాన్స్ మరియు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఉంటె ఆడిషన్స్ కి ఎంట్రీస్ పంపించండి అంటూ పిలులునిచ్చారు. మహానటి లో పాస్ట్ కి తీసుకెళ్ళాం, ఈ సినిమాతో ఫ్యూచర్ కి తీసుకెళతాం అని నాగ్ అశ్విన్ ప్రకటించి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular