fbpx
Saturday, May 4, 2024
HomeMovie Newsజాతిరత్నాలు: జస్టిస్ బల్వంత్ చౌదరి గా హాస్య 'బ్రహ్మ'

జాతిరత్నాలు: జస్టిస్ బల్వంత్ చౌదరి గా హాస్య ‘బ్రహ్మ’

BrahmanandamLook FromJathiRatnaalu Movie

టాలీవుడ్: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు ‘నవీన్ పోలిశెట్టి‘. ప్రస్తుతం ఈ హీరో తన రెండవ ప్రయత్నంగా ‘జాతి రత్నాలు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నవీన్ తో పాటు ప్రెసెంట్ టాప్ కమెడియన్స్ అయిన ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ఇందులో మరొక ప్రత్యేక కారెక్టర్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటిస్తున్నారు. ఈ రోజు బ్రహ్మానందం పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ సినిమాలో బ్రహ్మానందం లుక్ ని విడుదల చేసారు.

‘జస్టిస్ బల్వంత్ చౌదరి’ అనే లాయర్ లుక్ లో బ్రహ్మి లుక్ ని రిలీజ్ చేసింది సినిమా టీం. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు క్లాసిక్ గా ఉంటారు అని నిర్మాత నాగ్ అశ్విన్ ట్విట్టర్ లో తెలిపారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం కూడా ఒక సినిమాలో కనిపించబోతున్నాడు. చివరగా ‘అల వైకుంఠపురం లో ‘ సినిమాలో ఒక పాటలో ఇలా వచ్చి ఆలా వెళ్ళిపోతాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాట ఆకట్టుకున్నాయి. కే.వీ.అనుదీప్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చ్ 11 న విడుదల అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular