fbpx
HomeMovie Newsబిగ్ బాస్ ఫేమ్ సోహెల్ సినిమా ఫస్ట్ లుక్

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ సినిమా ఫస్ట్ లుక్

BigBossFame Sohail MovieFirstLook

టాలీవుడ్: చాలా సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేసి బిగ్ బాస్ ద్వారా మంచి పేరు సంపాదించిన వ్యక్తి సయ్యద్ సోహెల్ రియాన్. సోహెల్ బిగ్ బాస్ నుండి బయటకి రాగానే ఒక సినిమా సంతకం చేసాడు. ఈ రోజు హోలీ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా నుండి హీరో హీరోయిన్ కి సంబందించిన ఒక హోలీ పోస్టర్ ని విడుదల చేసి హోలీ శుభాకాంక్షలు తెలియ చేసింది సినిమా టీం.

ఈ సినిమాలో సోహెల్ కి జోడీ గా ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమాలో హీరోయిన్ గా నటించిన రూప కొడువాయుర్ హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి మరియు సజ్జల రవి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీ వివరాలు మరిన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular