fbpx
HomeMovie Newsత్వరలో ప్రారంభం కానున్న తెలుగు బిగ్ బాస్

త్వరలో ప్రారంభం కానున్న తెలుగు బిగ్ బాస్

BigBoss Realityshow Season4

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ కుదేలైంది. సీరియల్స్, సినిమా షూటింగ్స్ ఎక్కడివి అక్కడే నిలిచి పోయాయి. మధ్యలో సీరియల్స్ షూటింగ్ పునః ప్రారంభించినా కూడా కొందరు సీరియల్ నటులకి కరోనా రావడం తో వాటికి కూడా కొన్నిట్లో బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉండగా రియాలిటీ షో యాంకర్స్ కూడా కరోనా ముగిసే వారికి షూటింగ్స్ చేయమని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇదే క్రమం లో ప్రతి సంవత్సరం జరిగే బిగ్ బాస్ పై కూడా ఈ సంవత్సరం నీలి నీడలు కమ్ముకున్నాయి.కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజు స్టార్ మా వాళ్ళు ఆఫీషియల్ గా బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం అవబోతున్నట్టు ప్రకటించారు.

ప్రతి సీజన్ లాగే ఈ సారి కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అనేవి చాల ఊహాగానాలు, రూమర్స్ బాగానే చక్కర్లు కొడుతున్నాయి. హోస్ట్ పైన కూడా నాగార్జున, సమంత, ఎన్టీఆర్ అని చాలా పేర్లే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఏది కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటివరకు జరిగిన 3 సీజన్లలో పాల్గొన్న పార్టిసిపంట్స్ కి గాని చివరకి గెలిచిన విన్నర్స్ కి కూడా బయటకి వచ్చాక పెద్దగా అవకాశాలు ఐతే ఏమి రాలేదు కానీ బిగ్ బాస్ మాత్రం తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో హిట్ గా నిలిచింది. స్టార్ మా ఛానల్లో ప్రసారం కానున్న బిగ్ బాస్-4 ప్రారంభం కానుందని ఓ ప్రోమో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేసారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఆ ప్రోమో వీడియోలో కమింగ్ సూన్ అని తెలిపారు. ఇక ఈ వీడియోతో బిగ్ బాస్ లవర్స్ కి ఓ తీపివార్త అందిందని చెప్పవచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular