fbpx
HomeAndhra Pradeshఏపీ ఈఏపీసెట్‌-2021 ఫలితాలు విడుదల!

ఏపీ ఈఏపీసెట్‌-2021 ఫలితాలు విడుదల!

AP-EAPCET2021-RESULTS-RELEASED

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాం కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌, బైపీసీ స్ట్రీమ్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

ఈ ఈఏపీసెట్-2021 యొక్క ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. గత ఏడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన వారికి రేపటి నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తారని మంత్రి సురేష్‌ తెలిపారు.

టాప్ ర్యాంకర్ల వివరాలు:

మొదటి ర్యాంకు- చందం విష్ణు వివేక్‌(తూర్పుగోదావరి- కోరుకొండ)
రెండో ర్యాంకు- శ్రీనివాస కార్తికేయ(అనంతపురం)
మూడో ర్యాంకు- బొల్లినేని విశ్వాస్‌రావు(హన్మకొండ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular