fbpx
Tuesday, November 5, 2024
HomeMovie Newsఅఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఎప్పుడో?

అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఎప్పుడో?

NO-UPDATES-ON-AKHIL-NEXT-PROJECT
NO-UPDATES-ON-AKHIL-NEXT-PROJECT

మూవీడెస్క్: యువ హీరో అఖిల్ అక్కినేని, గతంలో ‘ఏజెంట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ ఫేస్ చేశాడు.

అప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించలేదు.

అయితే, ఈ సారి సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్న అఖిల్, తన తదుపరి సినిమాపై నిర్ణయం తీసుకునేందుకు చాలా టైమ్ తీసుకుంటున్నాడు.

టాలీవుడ్‌లో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్‌తో సినిమా చేయబోతున్నాడనే టాక్ ఉంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాకు అఖిల్ లుక్‌లో కూడా మార్పులు చేశారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా అనౌన్స్ కాలేదు.

ఇక మరో వైపు, హోమ్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో దర్శకుడు మురళీ కిషోర్‌తో అఖిల్ సినిమా చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.

మొత్తానికి, ఈ రెండు ప్రాజెక్ట్స్‌ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు.

మరి అఖిల్ ఈ సారి హిట్ కొడతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular