fbpx
Friday, April 26, 2024
HomeNationalఅస్వస్థత తో అసుపత్రిలో చేరిన అన్నా హజారే!

అస్వస్థత తో అసుపత్రిలో చేరిన అన్నా హజారే!

ANNAHAZARE-ADMITTED-IN-HOSPITAL-WITH-CHEST-PAIN

ముంబై: భారత దేశం లో ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన శ్రీ అన్నా హజారే ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 84 ఏళ్ల వయసున్న హజారేకు ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను పుణెలోని రూబీ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్టు రూబీ హాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ అవధూత్ భోధమ్వాడ్ మీడియాకు తెలిపారు.

ఆసుపత్రిలో చెరిన ఆయనకు యాంజియోగ్రఫీ పరీక్షలు చేయగా గుండెలోని కరోనరీ ఆర్టెరీలో చిన్న బ్లాకేజీ ఉన్నట్లు కనపడినట్లు ఆయన తెలిపారు, దీంతో వైద్య బృందం ఆ బ్లాకేజీని తొలగించినట్లు పేర్కొన్నారు.

కాగా పరిస్థితిని బట్టి ఆయనను రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకావం ఉందని తెలిపారు వైద్యులు. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆసుపత్రికి కాల్‌ చేసి అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular