fbpx
HomeMovie News`ప్రేమ కాదంట`- అల్లు శిరీష్ కొత్త సినిమా

`ప్రేమ కాదంట`- అల్లు శిరీష్ కొత్త సినిమా

AlluSirish PramaKadanta MovieAnnouncement

టాలీవుడ్: అల్లు అరవింద్ వారసుడిగా సినిమాకి పరిచయం అయ్యి నటుడిగా ‘గౌరవం’ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించాడు అల్లు శిరీష్. మొదటి సినిమా ఎక్సపెరిమెంటల్ సబ్జెక్టు అయినా కూడా శిరీష్ కి ఆశించినంత గుర్తింపు రాలేదు. తరువాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని కాన్సెప్ట్స్ ట్రై చేసినా కూడా శిరీష్ హిట్ సాధించలేకపోయారు. ఈ సారి కొంచెం గ్యాప్ తీసుకుని ఎలాగైనా హిట్ కొట్టాలని మరో రొమాంటిక్ జానర్ సినిమాతో రానున్నాడు.

ఈ రోజు అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ అనౌన్స్ చేసింది సినిమా టీం. ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో శిరీష్ కి జోడీ గా అను ఇమ్మానుయేల్ నటిస్తుంది. పోస్టర్స్ లో వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ చూపించారు. టైటిల్ చూస్తుంటే ప్రేమ కాదంట అని ఉంది పోస్టర్స్ చూస్తుంటే ఇదేదో లివ్ ఇన్ రిలేషన్షిప్ కి సంబందించిన సినిమాగా అనిపిస్తుంది. తన సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ వారి GA2 పిక్చర్స్ బ్యానర్ పై రాకేష్ శశి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular