fbpx
HomeMovie Newsషూటింగ్ మొదలుపెట్టిన 'అల్లుడు అదుర్స్'

షూటింగ్ మొదలుపెట్టిన ‘అల్లుడు అదుర్స్’

AlluduAdurs ShootingStarted PostCorona

టాలీవుడ్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న కొత్త మూవీ ‘అల్లుడు అదుర్స్’. ‘రాక్షసుడు’ సినిమా విజయం తర్వాత తాను తియ్యబోయే సినిమాలు చాలా జాగ్రత్తగా తీస్తానని మాటిచ్చాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహం తో ఇంకా మంచి స్క్రిప్ట్ తో పని చేయబోతున్నట్టు తెలిపాడు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇపుడు మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. 2021 సంక్రాతి బరిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికి విడుదలైన అల్లుడు అదుర్స్ ఫస్ట్ లుక్ తో ఐతే కొంతవరకు ఆకట్టుకున్నాడు. సీత సినిమా లో లాంటి ఇన్నోసెంట్ లుక్స్ తో ఫస్ట్ లుక్ ఉంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్ – అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూసూద్, వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘అల్లుడు అదుర్స్’ చిత్ర టీజర్ ను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular