fbpx
HomeMovie Newsబాలయ్య బాబు కూడా సమ్మర్ బరిలో వస్తున్నాడు

బాలయ్య బాబు కూడా సమ్మర్ బరిలో వస్తున్నాడు

BalayyaBoyapati MovieReleaseDate Announced

టాలీవుడ్: టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈ సంవత్సరం మారు మ్రోగనుంది. విడుదల తేదీల అప్ డేట్స్ గ్యాప్ లేకుండా వస్తున్నాయి. విడుదల తేదీలు కూడా అలాగే ఉన్నాయి. ఏప్రిల్, మే నెలలో ఐతే ఫుల్ కాంపిటీషన్ ఉంది. మే నెలలో మెగా స్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ సినిమాలు ఒకే రోజు తేడా తో వస్తున్నాయి. ఈ సమ్మర్ బరిలోకి అనుకోకుండా బాలయ్య బాబు కూడా వచ్చి చేరారు. బాలయ్య బాబు మరియు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమాని మే 28 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని ఇద్దరు గట్టి పట్టుదల తో ఉన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని BB3 అని సంబోధిస్తూ రిలీజ్ పోస్టర్ ఒకటి విడుదల చేసారు. ఇందులో బాలయ్య మంచి క్లాస్సి లుక్ తో నవ్వుతూ కనిపించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల సత్య నారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేకుండా సడన్ గా రిలీజ్ డేట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు దర్శకుడు బోయపాటి. ఈ ముగ్గురు టాప్ హీరోల సినిమాలతో సమ్మర్ హీట్ కన్నా బాక్స్ ఆఫీస్ హీట్ ఎక్కువగా ఉండేట్లు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular