fbpx
HomeMovie Newsఆగష్టు 19 న థియేటర్లలో 'మహా సముద్రం'

ఆగష్టు 19 న థియేటర్లలో ‘మహా సముద్రం’

Shrwaanand Mahaasamudram ReleaseDateAnnounced

టాలీవుడ్: టాలీవుడ్ లో సినిమా విడుదలల సునామి కొనసాగుతుంది. ఇన్ని రోజుల ఆగిన సినిమాలన్నీ వరుసపెట్టి విడుదల తేదీ లు ప్రకటిస్తూ ముందుగానే రిలీజ్ బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సునామి లో మహా సముద్రం కూడా జాయిన్ అయ్యింది. ‘RX100 ‘ సినిమా ద్వారా మొదటి హిట్ కొట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. తన రెండవ సినిమాకి చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ పైన బాగా పని చేసి శర్వానంద్ మరియు సిద్దార్థ్ లతో ఈ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మొదట చాలా మంది హీరోలు పని చేస్తున్నారు అని టాక్ వచ్చింది కానీ చివరకి శర్వా మరియు సిద్దార్థ్ చేతిలో పడింది.

ఈ రోజు ఈ సినిమా విడుదల తేది ప్రకటించారు. ఆగష్టు 19 న ఈ సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించి ఒక పోస్టర్ విడుదల చేసారు. ఒక పాత ఓడ పైన అటు ఇటు కూర్చున్న ఇద్దరు హీరోల సైడ్ వ్యూస్ చూపించారు. ‘వెలకట్టలేనంత ప్రేమ’ అనే టాగ్ జత చేసి సన్సెట్ షేడ్ లో ఉన్న పోస్టర్ పెట్టారు. అజయ్ భూపతి మరో ఇంటెన్స్ కథ చెప్పనున్నట్టు ముందుగానే హింట్స్ ఇస్తూ వచ్చారు. చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు సిద్దార్థ్ ఈ సినిమాతో తెలుగులోకి కంబ్యాక్ అవుతున్నాడు. ఈ సినిమాలో అదితిరావు హైదరి, అను ఎమాన్యూల్ నటిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ బ్రహ్మాం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular