fbpx
HomeTelanganaతెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం స్పష్టమైన మార్పు కోసం

తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం స్పష్టమైన మార్పు కోసం

TELANGANA-NEW-REVENUE-ACT-APPROVED

హైదరాబాద్‌: తెలంగాణ లో రద్దు చేసిన వీఆర్వోల వ్యవస్థ ద్వారా వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. అలాగే వీఆర్‌ఏలలో అత్యధికంగా పేదవర్గాల వారే ఉన్నారని, వీరిలో వయోభారం ఉన్నవారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు.

వీఆర్‌ఏలకు ఇక పై స్కేల్‌ ఇవ్వనున్నట్లు, అలా ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి‌ మాట్లాడుతూ, ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను నిర్వహిస్తూ రెవెన్యూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. రెవెన్యూ శాఖలో అన్నిస్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు అలవెన్సు రెగ్యులర్‌గా ఇవ్వాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి ట్రెసా తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌ కుమార్‌ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో భూ పరిపాలన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పోస్టును భర్తీ చేయాలని, అర్హులైన వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రెవెన్యూశాఖలో ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందిని పెంచాలని, కంప్యూటర్‌ ఆపరేటర్లను రెగ్యులరైజ్‌ చేయాలని, రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించడానికి ముందు తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని వారు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్, సెక్రటరీ స్మితా సభర్వాల్‌ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular