fbpx
HomeMovie Newsకొత్త లుక్ తో షాక్ చేసిన బాస్

కొత్త లుక్ తో షాక్ చేసిన బాస్

MegastarChiranjeevi Shocking Newlook

టాలీవుడ్: మెగా స్టార్ చిరంజీవి ని ఇండస్ట్రీ లో కొందరు బాస్ అని కూడా పిలుస్తారు. ఇపుడు మెగాస్టార్ ఇచ్చిన షాకింగ్ లుక్ చూసి గుండు బాస్ అని పిలుస్తున్నారు. సడన్ గా మెగా స్టార్ చిరంజీవి గుండు తో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేసారు. ఈ ఫోటో ని షేర్ చేసి ‘అర్బన్ మాంక్ – నేను మాంక్ అని అనుకోవచ్చా ?’ – అంటే పట్టణ యోగి- నేను యోగి అని అనుకోవచ్చా అని ఒక ప్రశ్నార్ధకం పెట్టారు. ఆ ప్రశ్నను పక్కన పెడితే చిరు లుక్ చూసి అందరు షాక్ అవుతున్నారు. బాస్ నుండి గుండు బాస్ గా మారిన మెగా స్టార్ అని అంటున్నారు.

ఇంతకీ ఈ కొత్త లుక్ ఆచార్య సినిమా కోసమే లేక మరేదైనా మేక్ ఓవర్ కోసం ప్రయోగం చేస్తున్నారా అని చిరు బయటపెట్టలేదు. ఇప్పటికే ఆచార్య సినిమాలో చిరంజీవి వివిధ గెటప్ లో కనపడతారు అని ఒక రూమర్ ఉంది. మరి ఈ కొత్త లుక్ ఆ సినిమాలోని పాత్రలో ఒక భాగమా లేక కరోనా టైం లో కొత్త లుక్ ప్రయోగాలు ఎమన్నా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

https://www.instagram.com/p/CE9ZNWljnwC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular