fbpx
HomeMovie Newsకంగనా ను భగత్ సింగ్ తో పోల్చిన విశాల్

కంగనా ను భగత్ సింగ్ తో పోల్చిన విశాల్

Vishal SupportTo KanganaRanaut

చెన్నై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఏదో ఒక విషయంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోని సామాన్య ప్రజలని తెలియని కొత్త కొత్త కోణాల్ని బట్ట బయలు చేస్తుంది. మొదలు నేపాటిసమ్ తో మొదలు పెట్టిన కంగనా, బాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ హీరో వారసులు ఇపుడు డ్రగ్స్ పైన కూడా తన మాటల్ని గట్టిగానే వినిపిస్తుంది. ఈ మాటల తాకిడి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తాకింది. ఇందులో భాగంగా ప్రస్తుతం కంగనా కి మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవ ముదురుతోంది. కంగనా కార్యాలయాన్ని అక్రమ కట్టడం అని చెప్తూ కొంచెం కూడా సమయం ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్డింగ్ ని కూల్చివేసింది. దీనిపై కంగనా కూడా గట్టిగానే స్పందించింది.

ఐతే ఇంత జరుగుతున్నా పెద్ద హీరోలు ఎవరూ కూడా కంగనా కి సపోర్ట్ ఇవ్వడం లేదు. ఈ సమయం లో తమిళ స్టార్ హీరో విశాల్ కంగనా ని భగత్ సింగ్ తో పోలుస్తూ హాట్సాఫ్ చెప్పాడు. తన లెటర్ లో విశాల్ ఇలా చెప్పాడు “డియర్ కంగనా, మీ ధైర్య సాహసాలకి హ్యాట్సాఫ్. ఏది కరెక్ట్.. ఏది రాంగ్ అనేది మీరు రెండుసార్లు ఆలోచించలేదు. మీ పర్సనల్ ఇష్యూ కానప్పటికీ ఒక ప్రభుత్వ ఆగ్రహాన్ని మీరు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించడానికి ప్రజలు ఎలా స్ట్రాంగ్ గా నిలబడవచ్చో ఉదాహరణగా చూపించారు. 1920లో భగత్ సింగ్ ఎలా అయితే నిలబడ్డాడో అలా మీరు నిలబడ్డారు. సెలబ్రిటీలే కాదు సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. వాక్ స్వాతంత్రపు హక్కు (ఆర్టికల్ 19). కుడోస్ టూ యూ. నేను మీకు నమస్కరిస్తున్నాను” .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular