fbpx
Sunday, April 28, 2024
HomeAndhra Pradeshకరోనా టెస్టుల్లో దేశంలో ఏపీ కి అగ్రస్థానం

కరోనా టెస్టుల్లో దేశంలో ఏపీ కి అగ్రస్థానం

AP-TOP-IN-COVID-TESTS

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల ప్రక్రియ ఎవరూ ఊహించని స్దాయిలో వేగం​తో దూసుకుఎల్తోంది. కోవిడ్‌-19 వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఎటువంటి ల్యాబ్‌లు లేకపోయినా సమయానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా కరోనా పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం మెరుగుపరుచుకుంది.

విస్తృతంగా కరోనా పరీక్షలు చేస్తూ ప్రస్తుతం రాష్ట్రం టెస్టుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 114 టెస్టులతో మొదలై అధికారుల కృషి, ప్రభుత్వ ముందుచూపుతో రాష్ట్రం ఇప్పుడు మిలియన్‌ జనాభాకు 50,664 పరీక్షలు చేసే స్థాయికి ఎదిగింది. ఆగష్టు 13న ప్రతి పది లక్షల‌ జనాభాకు 50వేలకు పైగా టెస్టులు పూర్తిచేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ముందువరుసలో నిలిచింది.

ఇక కరోనా టెస్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకున్న తీరును గమనిస్తే, ఏప్రిల్‌ 19న ఏపీలో ప్రతి పదిలక్షల మందికి 505 కరోనా పరీక్షలు నిర్వహించగా జూన్‌ 13న ఏకంగా 10,048కి, జులై 8న 20,182 టెస్టులు చేయగలిగే సామర్ధ్యాన్ని పెంచుకోగలిగింది. ఆగస్ట్‌ 4 నాటికి ప్రతి పదిలక్షల మందిలో 40,731 మందికి పరీక్షలు నిర్వహించగా ఆగస్ట్‌ 13 నాటికి ఆ సంఖ్య ఏకంగా 50,664కు ఎగబాకింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular