fbpx
HomeTelanganaశాంత్రిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేస్తే జైలుకే

శాంత్రిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేస్తే జైలుకే

CONTROVERSIAL-POSTS-IN-SOCIAL-MEDIA

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు మరియు వివాదాస్పద పోస్టులు పెడితే సదరు వ్యక్తులు ఖచ్చితంగా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలను హెచ్చరించారు.

ఓ నకిలీ మరియు వివాదాస్పద పోస్టు కారణంగా బెంగళూరులో తీవ్ర అల్లర్లు చెలరేగి కాల్పులకు దారితీయడంతో డీజీపీ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల విఘాతానికి కారణమయ్యే ఈ తరహా వివాదాస్పద, అసత్య పోస్టులు సమాజంలో ఆస్తి, ప్రాణనష్టాలకు దారితీస్తాయన్నారు.

సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్టులపై తెలంగాణ పోలీసులు 24 గంటలపాటు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. అసభ్యకరంగా, అల్లర్లకు కారణమయ్యే పోస్టులు పెట్టినవారిపై తప్పక క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్ని పోలీసుస్టేషన్ల స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఈ విషయంలో పౌరులంతా పోలీసులకు సహకరించాలని మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనవస్రమైన పోస్టులు చేసి బంగారు భవిష్యత్తుని కటకటాల పాలు చేసుకోకుంద జాగ్రత్త వహించాలని సూచించారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే శిక్షలు చాలా కఠీనంగా ఉంటాయని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular