fbpx
HomeTelanganaఆర్టీ-పీసీఆర్ కిట్లే వాడాలి: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ

ఆర్టీ-పీసీఆర్ కిట్లే వాడాలి: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ

RT-PCR-TESTS-IN-TELANGANA

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ), బస్తీ దవాఖానాల్లోనూ ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాలకు ఆర్‌టీ–పీసీఆర్‌ కిట్లను పంపించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు పెద్దాసుపత్రుల నుంచి పీహెచ్‌సీ స్థాయి వరకు 1,100 పరీక్షా కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుతో అరగంటలోపే ఫలితం తెలుస్తోంది. అందులో కరోనా పాజిటివ్‌ వస్తే పూర్తిస్థాయి పాజిటివ్‌గానే గుర్తించవచ్చు. కానీ యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌ వస్తే దాని కచ్చితత్వం కేవలం 50 నుంచి 70 శాతమేనని ఐసీఎంఆర్‌ ప్రకటించింది.

ఇందులో నెగెటివ్‌ వచ్చి, లక్షణాలు ఏమాత్రం లేకపోతేనే దాన్ని నెగెటివ్‌గా గుర్తించాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఒకవేళ నెగెటివ్‌ వచ్చి కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని ఐసీఎంఆర్‌ చెప్పింది.

కాబట్టి ఇప్పుడు పీహెచ్‌సీ స్థాయిలో యాంటీజెన్‌ టెస్టులు చేయించుకొని నెగెటివ్‌ వచ్చి లక్షణాలున్న వారు వాళ్ళకు కరోనా లేదని సాధారణంగా తిరుగుతున్నారన్న భావన ఉంది. దీంతో అటువంటి వారికి ఇక నుంచి తక్షణమే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేస్తారు. ఆర్‌టీ–పీసీఆర్‌ కోసం తీసుకున్న శాంపిళ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేబొరేటరీలకు పంపిస్తారు. వాటి ఫలితాలు 24 గంటల నుంచి రెండు, మూడ్రోజుల్లో వస్తాయి.

తెలంగాణ లో కరోనా పరీక్షలు, చికిత్సల వివరాలను తెలుసుకునేందుకు సోమవారం కేంద్ర బృందం ఢిల్లీ నుంచి వస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం ఇక్కడకు బృందాన్ని పంపిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందం సోమవారం పలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలను పరిశీలించనుంది. అలాగే యాంటీజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన వారికి లక్షణాలుంటే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా కేంద్ర బృందం ఆరా తీయనున్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular