fbpx
HomeMovie Newsహిందీ లో రాజ్ కుమార్ తో హిట్ సినిమా

హిందీ లో రాజ్ కుమార్ తో హిట్ సినిమా

RajKumarRao in HIT Remake

హైదరాబాద్: లాక్ డౌన్ ముందుగా విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ దర్శకత్వంలో నాని నిర్మించిన ‘హిట్’ చిత్రం పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఒక మర్డర్ కేసు చుట్టు తిరిగే కథ ఆధారంగా ఈ చిత్రంను రూపొందించారు. హీరో విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ఆ కేసు ను ఛేదించే ఇన్విస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించారు. ఇంట్రెస్టింగ్ కథనంతో థ్రిల్లింగ్ ట్విస్ట్ లతో సాగిన హిట్ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేసేందుకు దిల్ రాజు మరో నిర్మాతతో కలిసి ప్లాన్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమాకి హీరో ని లాక్ చేసారు మేకర్స్. బాలీవుడ్ లో వెర్సటైల్ మూవీస్ కి కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచిన రాజ్ కుమార్ రావు ని ఈ సినిమాకి హీరో గా లాక్ చేసారు నిర్మాతలు.

తెలుగు లో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ‘శైలేష్ కొలను’ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. తెలుగు లో సైలెంట్ గా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా హిందీ లో కూడా అదే టైటిల్ తో నిర్మించే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థం లో ఈ సినిమా విడుదలకి సిద్ధం అవచ్చు అని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular