fbpx
HomeMovie Newsశకుంతల దేవి ట్రైలర్ విడుదల

శకుంతల దేవి ట్రైలర్ విడుదల

VidyaBalan As Shakuntaladevi Trailer

ముంబై: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ నటి విద్యాబాలన్ , ఇదివరకే సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ లో నటించి మెప్పించింది. ఇప్పుడు దానికి కంప్లీట్ ఒప్పొసిట్ అయిన మరొక సినిమా ‘శకుంతలా దేవి‘ బయో పిక్. మానవ కంప్యూటర్ గా ప్రసిద్ధి చెందిన మాథెమేటిషియన్ శకుంతల దేవి జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ రూపొందించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన శకుంతలదేవి బయోపిక్ ట్రైలర్ ఈ రోజు విడుదల అయింది. శకుంతల దేవి పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయి మెప్పించిందనే చెప్పాలి. దాదాపు 3 నిమిషాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్ వినోదంగా మరియు ఎమోషనల్ గా కూడా ఉంది. ఎంతో సరదాగా విద్యాబాలన్ శకుంతల దేవి పాత్రను నడిపిస్తూనే ఎమోషనల్ గా ఆలోచనలో పడేస్తోంది.

సినిమాలో శకుంతల దేవి ని బాల్యం నుండి అంచలంచెలుగా ఎదిగిన తీరుని గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసే స్టేజి అలాగే తాను ఒక తల్లి అయిన తర్వాత ఉండే ఎమోషన్స్ ఇలా చాలా స్టేజెస్ చూపించినట్టు తెలుస్తుంది. ఈ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త జీవిత ప్రయాణంలో కుటుంబం భర్త పిల్లలు, ఇలా అన్నీ అంశాలను మేళవించారు మేకర్స్. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో జులై 31 న విడుదల చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. అను మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular