fbpx
HomeNationalయూపీలో భారీ విక్టరీ సాధించిన బీజేపీ!

యూపీలో భారీ విక్టరీ సాధించిన బీజేపీ!

BJP-WINS-UTTARPRADESH-ASSEMBLY-ELECTIONS-2ND-TIME

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా పార్టీ మరోసారి భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండవ సారి సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సీఎం పీఠాన్ని ఎక్కబోతున్నారు. యూపీ ప్రజలు యోగి ప్రభుత్వంపై నమ్మకంతో రెండోసారి కాషాయ పార్టీకి అనూహ్య మెజార్టీని కట్టబెట్టారు.

విజయం దక్కాక యోగి ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. ఈ విజయంతో ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత‍్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిందని ఆయన కితాబునిచ్చారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండోసారి తమకు అధికారం ఇచ్చారని తెలిపారు.

విజయానికి తోడ్పడిన పార్టీలోని ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశారని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు జరిగాయని కూడా ఆయన ఆరోపించారు. కానీ, ప్రజలు అవేవీ పట్టించుకోకుండా బీజేపీకి విజయం అందించారని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular